Site icon TeluguWala

TSPSC GROUP 1 నోటిఫికేషన్ ఫిబ్రవరి 2024

TSPSC GROUP 1 NOTIFICATION

ఫిబ్రవరి 2024 మొదటి వారంలో Group 1 మరియు ఇతర నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లపై దృష్టిసారించింది.

ఫిబ్రవరి మొదటి వారంలో వెలువడే ఛాన్స్

అదనపు ఖాళీల వివరాలను తెలపాలంటూ వివిధ శాఖలకు ఉత్తర్వులు .ఈ నేపథ్యంలో తొలుత గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గ్రూప్-2 (group 2) పై కూడా ప్రభుత్వ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

గ్రూప్ 1 పరీక్ష

ప్రభుత్వం గ్రూప్-1 feb 2022 నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పరీక్షకు 3.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్లో మొదటి వారంలో పరీక్షను నిర్వహించారు. కాగా 2.80 లక్షల మంది పరీక్షకి హాజరయ్యారు. ఆ తర్వాత పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసి .. మెయిన్స్ తేదీలు ఖరారు చేశారు. కానీ పేపర్ లీకేజీ వల్ల ఆ పరీక్షను రద్దు చేశారు.

మరలా 2023 జూన్ లో పరీక్ష నిర్వహించారు. కానీ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఆ పరీక్షను కూడా రద్దు చేయాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో దీనిపై tspsc సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఇంత వరకు దానిపై వాదనలు జరగలేదు.

TSPSC GROUP 1 RESCHEDULE

ఇక ఇప్పట్లో ఈ కేసు పరిష్కారమయ్యే అవకాశం లేదని భావిస్తున్న ప్రభుత్వం మరికొన్ని పోస్టులను అదనంగా కలిపి కొత్త నోటిఫికేషన్ ను జారీ చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్త నోటిఫికేషన్లో మరో 50 నుంచి 100 వరకు అదనపు పోస్టులు కలవనున్నట్లు సమాచారం.

GROUP 1 SUB-NOTIFICATION


ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లపై దృష్టిసారించింది.ఫెబ్రవరి మొదటి వారంలో గ్రూప్-1తో ఇతర నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో నే Group -1 అదనపు పోస్టుల ఖాళీల వివరాలు ఇవ్వాలని వివిధ ప్రభుత్వ విభాగాలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సాయంత్రం లోపు పోస్టుల వివరాలను పంపాలని ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు.


త్వరలో ఆ పరీక్షల ఫలితాలు…GROUP 4 RESULT OUT SOON
ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయిన గ్రూప్-4, జూనియర్ లెక్చరర్, మహిళా శివు సంక్షేమ అధికారుల ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తులు చేపడుతున్నారు. పరీక్షలు రాసి ఆరు నెలలైనా గురుకుల, గ్రూప్-4 పరీక్ష ఫలితాలు ఇంతవరకూ వెల్లడించలేదు. వీటి ఫలితాల కోసం దాదాపు 10 లక్షల మంది అభ్యర్ధులు ఎదురు చూస్తన్నారు.

GROUP 2 , GROUP 3 జారీ చేసిన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను కూడా ప్రకటించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Exit mobile version