Site icon TeluguWala | Telugu media Blog site | Movies | sports | Exams | Jobs | Entertainment

TS Staff Nurse Certificates Verification Date 2023 : మెరిట్ జాబితా విడుదల

Staff nurse results

Staff Nurse పోస్టుల మెరిట్ జాబితా ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి గురువారం(28 డిసెంబర్ ) విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.

మొత్తం స్టాఫ్ నర్స్ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు చేశారు. అందులో 38,674 మంది రాత పరీక్ష రాశారు. వారిలో నుంచి 8,882 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచినట్లు ఆయన వివరించారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

Staff Nurse Certificates Verification Dates and Place

శనివారం (30వ డిసెంబర్ ) నుంచి జనవరి నెల 6వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని చెప్పారు. వెరిఫికేషన్ ఎక్కడంటే…

PLACE OF VERIFICATION:

ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ (ఈస్ట్), 13/పీ, సెయింట్ మైకేల్స్ కాలనీ, అభ్యుదయన గర్, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జాగిర్, హైదరాబాద్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికెట్లు , డాక్యుమెంట్లతోపాటు వాటికి సంబందించి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలి, అలాగే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్ పీడీఎఫేను వెంట తీసుకొని రావాలి.

Staff Nurse Important Certificates:

1.ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ రుజువు సర్టిఫికెట్,

2. ఎస్సీ, ఎస్టీ. బీసీ రిజర్వేషన్ వర్తించేవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ తీసుకురావాలి. నాన్ శ్రీమీలేయర్ సర్టిఫికెట్ అందించని బీసీలను ఓసీలుగా పరిగణిస్తారు.

3.ఈడబ్ల్యూఏ ఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్ధులు తాజా ఆదాయ ధ్రువీకరణపత్రం తీసుకురావాలి.

4.స్పోర్ట్స్ కేటగిరీ కింద రిజర్వేషను క్లెయిమ్ చేసే వారు స్పోర్ట్స్, సర్టిఫికెట్ తీసుకురావాలి.

5.దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ తీసుకురావాలి,

స్థానికతను తెలిపే సర్టిఫికెట్లు, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్చింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకొని రావాలి.

Staff Nurse Certificate Verification Timings

ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి ఆరో తేదీ వరకు ప్రతి రోజూ మూడు సెషన్లలో వర్టిపికెట్లు నెరపి కేషన్ నిర్వహిస్తారు. ప్రతీ సెషన్లో 800 నుంది. 500 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు.

First session: ఉదయం 9.15 నుంచి 11.15 గంటల వరుకు

Second session: మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు

Third session: మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు

ఒరిజినల్ సర్టిఫికెట్లు తేకుంటే అభ్యర్థిత్వం రద్దు . సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు రాకపోవడం లేదా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. ప్రొవిజినల్ జాబితా ఎంపిక జాబితా కాదని గోపీకాంత్ రెడ్డి సృష్టం చేశాడు. కాగా, 7,094 స్టాఫ్ నర్సుల, పోస్టులను భర్తీ చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వచ్చిన వారిలో అర్తులుండి, పోస్టుల కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే, తమ వద్ద ఉన్న అర్హుల జాబితా నుంచి మరికొందరిని పిలుస్తామని ఆయన తెలిపారు.

స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ లిస్ట్ రిలీజ్

ఈ నెల 30 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ భర్తీ కానున్న 7,094 పోస్టులు

స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ లిస్టు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు(MHSRB) గురువారం విడుదల వేసింది. తొలుత పరీక్ష రాసిన అభ్యర్థుల అందరి మార్కుల వివరాలతో కూడిన 1,419 పేజీల లిస్టును బోర్డు వెబ్సైట్ mharb.telangana..ఉంచింది.

ఆ తర్వాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్ధుల హాల్ టికెట్ నంబర్లతో కూడిన మరో లిస్టును వెబ్సై ట్లో అప్లోడ్ చేసింది. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈ నెల 30వ తేదీ నుంచి ఫిజికల్ గా వెరిఫై చేస్తామని బోర్డు ప్రకటించింది.

జాప్యం లేకుండా భర్తీ ప్రక్రియ ప్రభుత్వ దవాఖాన్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఏడాది ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించగా…38,674 మంది హాజరయ్యారు. కానీ, పరీక్ష ఫలితాల విడుదల లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ జాప్యం చేసింది.

ఈలోగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ప్రభుత్వ దవాఖా న్లలో ఖాళీగా ఉన్న మరో 1,890 పోస్టులను కూడా ఇదే నోటిఫికేషన్తో కలిపి భర్తీ చేయాలని ఆఫీసర్లు, యి. ఫలితాలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరాయి.

TS MHSRB Staff Nurse Salary & Job Profile 2023- Pay Scale , Job Responsibilities Here

స్టాఫ్ నర్సుకు ఎంపికైన అభ్యర్థులకు MHSRB స్టాఫ్ నర్స్ పే స్కేల్ రూ. 36,750/- నుండి 1,06,990/-. ఉద్యోగులు ప్రాథమిక వేతనంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ మొదలైన ఇతర అలవెన్సులను కూడా అందుకుంటారు.

JOB Responsibilities:

ఒక MHSRB స్టాఫ్ నర్సు రోగుల నర్సింగ్ కేర్ యొక్క మొత్తం ప్రణాళిక మరియు వార్డులో పనిచేసే నర్సులకు రోగులను అప్పగించే బాధ్యతను కలిగి ఉంటాడు.
అనారోగ్యంతో ఉన్న రోగులకు నేరుగా నర్సింగ్ కేర్ అందించడం & ప్రధాన ఆపరేషన్లలో సర్జన్లకు నేరుగా సహాయం చేయడం.
రోగుల మొత్తం ఆరోగ్య అవసరాలు తీర్చబడుతున్నాయని నిర్ధారించడం.

Staff Nurse heighest marks list :

ఈ అంశాలపై రివ్యూ చేసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాత నోటిఫికేష న్లోని 5,204 పోస్టులతో పాటు 1,890 పోస్టులను కూడా కలిపి మొత్తం 7,094 పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ నెల 18వ తేదీనే రాత పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేశారు. అభ్యంత రాల స్వీకరణ అనంతరం గురువారం మెరిట్ లిస్టును రిలీజ్ చేశారు. రాత పరీక్ష, వెయిటేజీతో కలిపి అత్యధికంగా ఓ అభ్యర్థి 89.65 మార్కులు సాధింది. స్టేట్ ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంది. అత్యలపంగా జీరో (0) మార్కులతో నలుగురు అభ్యర్థులు చివరి స్థానాల్లో నిలిచారు.

SSC JE పేపర్ 2 results and cut off 2023 కోసం …ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version